లాడెన్ బ్రతికే ఉన్నాడు: ఆఫ్గన్ వార్‌లార్డ్

Gulzar Ghouse| Last Modified మంగళవారం, 10 నవంబరు 2009 (15:41 IST)
ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అల్‌ఖైదా తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఇంకా బ్రతికే ఉన్నాడని ఆఫ్గన్ వార్‌లార్డ్, హిజ్బ్-ఏ-ఇస్లామి చీఫ్ గుల్‌‌బుదిన్ హెక్‌మత్యార్ అన్నారు.

ఓ ప్రైవేటు వార్తా ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో హెక్‌మత్యార్ మాట్లాడుతూ... ఉగ్రవాదులు ఆఫ్గనిస్థాన్ నుంచి పారిపోయేందుకు అమెరికా మంచి అవకాశాలు కల్పిస్తోందని, అల్‌ఖైదా తన తప్పుడు నిర్ణయాల వలన తాలిబన్లు పుంజుకుంటున్నారని, లాడెన్ ఇంకా బ్రతికే ఉన్నాడని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

ఆఫ్గనిస్థాన్ అంశంపై ఇరాన్, భారత్, చైనా దేశాలు అమెరికాకు సంపూర్ణ మద్దతునిస్తున్నాయని, దీంతో ఆఫ్గన్ దేశానికి అమెరికా సాయుధ దళాలు పంపడంలో ముందుందని ఆయన అన్నారు.

ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన దాడుల్లో పాక్ భద్రతా దళాలు విదేశీ బలగాలపై దాడులకు పాల్పడాలనే ఉద్దేశ్యంతోనే ఆ దాడులు జరిగాయని ఆయన వివరించారు.


దీనిపై మరింత చదవండి :