వాట్ !...నాకు నోబెల్ పురస్కారమా...! : ఒబామా

Gulzar Ghouse|
FILE
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతికి తనను ఎంపిక చేయడం నిజంగానే తనను ఆశ్చర్యపరచిందని, ఈ సన్మానానికి తాను అర్హుడినేనా అని తనుకు సందేహం కలిగిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా అన్నారు.

నార్వేకు చెందిన శాంతి బహుమతిని నోబెల్ పురస్కార సమితి ఒబామాకు ప్రకటించడంతో ఆయన సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. ఈ పురస్కారాన్ని అందుకునే అరుదైన వారిలో తాను ఏ మాత్రం సాటి రానని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నోబెల్ శాంతి బహుమతి సమితి నిర్ణయంతో తాను ఆశ్చర్యచకితుడినైనానని ఒబామా వైట్‍‌హౌస్‌లో తెలిపినట్లు రోజ్ గార్డెన్ తెలిపారు.

శాంతి పురస్కారమనేది ఎవరైతై న్యాయం కోసం, ప్రజల కోసం పోరాడుతున్నారో వారికి అందవలసిన పురస్కారమని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

రానున్న 21వ శతాబ్దంలో ఎదురయ్యే ప్రతి సవాళ్ళను ఎదుర్కొనేందుకు తనకు ఇది ఓ ఉత్తమమైన ఔషధంలా భావిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.


దీనిపై మరింత చదవండి :