ఆయుధాల్లో కోతపై యూఎస్, రష్యా అంగీకారం

Phani|
రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వెదెవ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొత్త వ్యూహాత్మక ఆయుధ కోత ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ ఒప్పందం డిసెంబరునాటికి సిద్ధమవుతుందని క్రెమ్లిన్ ప్రెస్ సర్వీస్ తెలిపింది. మంగళవారం ఇరుదేశాల అధ్యక్షులు ఫోన్‌లో ఈ ఒప్పందంపై చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ఒప్పందాన్ని రూపొందించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంబంధిత యంత్రాంగానికి అదనపు ఆదేశాలు జారీ చేస్తానని బరాక్ ఒబామా చెప్పారని ఈ వార్తా సంస్థ వెల్లడించింది. కోసం ఉద్దేశించి ఇరుదేశాల మధ్య గతంలో స్టార్ట్ 1 ఒప్పందం కుదిరింది. దీని స్థానంలో కొత్త వ్యూహాత్మక ఆయుధ నియంత్రణ ఒప్పందాన్ని సిద్ధం చేసేందుకు ఇరుదేశాల అధ్యక్షులు ఇటీవల ఓ అంగీకారానికి వచ్చారు.


దీనిపై మరింత చదవండి :