1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. 24 Killed As Car With Explosives Rams Train Carrying Pak Soldiers In Balochistan

బలూచిస్థాన్‌లో రక్తపాతం - పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి..

balochistan train blast
పాకిస్థాన్‌లో ఘోర ఉగ్ర దాడి జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సైనిక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోయాగు, మరో 50 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో సైనికులు కూడా ఉన్నట్టు సమాచారం. 
 
బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ఆదివారం ఈ దాడి జరిగింది. క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళుతున్న ఈ రైలులో సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. మంగళవారం నుంచి ప్రారంభంకానున్న బక్రీద్ పండుగ కోసం వీరంతా తమ స్వస్థాలకు వెళుతుండగా ఈ దారుణం జరిగింది. రైలులో క్వెట్టాలోని చమన్ పట్టక్ వద్ద సిగ్నల్ దాటుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలతో నింపిన కారుతో ఒక బోగీని ఉగ్రవాదులు ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. 
 
ఈ పేలుడు తీవ్రతకు రైలు బోగీ నుజ్జునుజ్జయి పక్కకు ఒరిగిపోయింది. పలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ దాడిలో గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించాయి. 
 
విస్తీర్ణంలో పాకిస్థాన్‌లోనే అతిపెద్ద ప్రావిన్స్‌ అయినప్పటికీ అభివృద్ధిలో మాత్రం బలూచిస్థాన్ చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉంది. ఈ ప్రావిన్స్‌లోని సహజ వనవరులను కేంద్రం ప్రభుత్వం దోచుకుంటుందని స్థానిక ప్రజలకు ప్రయోజనాలు కల్పించడం లేదని బలూచ్ వేర్పాటువాద గ్రూపులు కొన్నేళ్లుగా ఆరోపిస్తున్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్