ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మార్చి 2026 (07:56 IST)

కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 400మంది మృతి.. తాలిబన్

Kabul Hospital
Kabul Hospital
కాబూల్‌లోని ఓ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడి చేసిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. ఈ వైమానిక దాడిలో కనీసం 400 మంది మరణించారని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో పదేపదే సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడులను పాకిస్థాన్ జరుపుతోంది. 
 
కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ పిలుపులను పాకిస్థాన్ పట్టించుకోలేదు. దీనిపై ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్, ఎక్స్‌ పోస్ట్‌లో, స్థానిక సమయం సోమరావం రాత్రి 9 గంటలకు ఆసుపత్రిపై వైమానిక దాడి జరిగిందని, 2,000 పడకల సౌకర్యంతో కూడిన ఆస్పత్రి ధ్వంసమైందని చెప్పారు. 
 
మృతుల సంఖ్య ఇప్పటివరకు 400 మందికి చేరుకుందని, దాదాపు 250 మంది గాయపడినట్లు తెలుస్తోందన్నారు. మంటలను నియంత్రించడానికి మరియు మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయని ఫిత్రాత్ చెప్పారు.
 
భవనం శిథిలాల మధ్య మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తుండగా, భద్రతా దళాలు ఫ్లాష్‌లైట్‌లను ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టారని ఆ దేశ టీవీ ఛానెల్స్ తెలిపాయి.