1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. An 81-year-old woman flew to Senegal for her 24-year-old boyfriend

ఆమెకు 81 ఏళ్లు.. ఆయనకు 24 ఏళ్లు.. ఎయిర్ పోర్టులు కలిసివ వేళ... (video)

love
love
ఫ్రాన్స్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలు, ఆఫ్రికాకు చెందిన 24 ఏళ్ల యువకుడితో గాఢమైన ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య ఏకంగా 57 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటం విశేషం. ప్రేమకు సరిహద్దులు, వయసుతో ఎలాంటి సంబంధం లేదని ఈ వింత ఘటన నిరూపించింది. సుమారు రెండేళ్ల క్రితం సోషల్ మీడియా వేదికగా వీరికి ఏర్పడిన పరిచయం.. ఆపై స్నేహం, ప్రేమగా మారింది. రాబోయే సెప్టెంబర్ మాసంలోనే వివాహం చేసుకుని ఒక్కటికాబోతున్నామని ఆ వృద్ధురాలు అధికారికంగా వెల్లడించింది. 
 
కాగా.. గత రెండేళ్లుగా ప్రతిరోజూ వీడియా కాల్స్, చాటింగ్ ద్వారా సందేశాలు పంపుకుంటూ తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆ వృద్ధురాలు తన ప్రియుడిని కలిసేందుకు విమానంలో వచ్చింది.  ఎయిర్‌పోర్ట్‌లో వారిద్దరూ ఎదురైన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఒకరినొకరు కౌగిలించుకుని, ముద్దులతో సంతోషాన్ని పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tanay (@uncutindia.in)

About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
24 యేళ్ళు శ్రమించి మోడీ నిర్మించుకున్న ఇమేజీ 2 వారాల్లో ధ్వంసమైంది : అరుంధతీ రాయ్