బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2016 (18:10 IST)

జలవారోత్సవాలు ప్రారంభం: నీటి కోసమే సమయమంతా వృధా.. రాతియుగంలో ఖాళీ బిందెతో వెళ్తే?

సోమవారం నుంచి (ఆగస్టు 29) నుంచి జలవారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా నీటి ఆవశ్యకతపై కీలక సంస్థలు ప్రచారం చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి బాలల నిధి (యునిసెఫ్) గణాంకాలను వి

సోమవారం నుంచి (ఆగస్టు 29) నుంచి జలవారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా నీటి ఆవశ్యకతపై కీలక సంస్థలు ప్రచారం చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి బాలల నిధి (యునిసెఫ్) గణాంకాలను విడుదల చేసింది.

ఈ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు తమ అత్యంత విలువైన సమయాన్ని నీరు తెచ్చేందుకే ఖర్చు పెడుతున్నట్లు వెల్లడైంది. నీటిని తెచ్చేందుకే మహిళలు, బాలికలు ఎక్కువ భాగం తమ సమయాన్ని నీళ్లు తెచ్చేందుకే వెచ్చించాల్సి వస్తుందని యునిసెఫ్ తెలిపింది. 
 
ఈ గణాంకాల ప్రకారం.. మహిళలు, బాలికలు నీటి కోసం వెచ్చించే సమయం.. 22,800 సంవత్సరాలకు సమానమని వివరించింది. మనదేశంలో లక్షలాది బాలికలకు నీటిని తేవడం నిత్యకృత్యంగా మారిపోయిందని యునిసెఫ్ వెల్లడించింది. దీనిపై యునిసెఫ్ అధికారి సంజయ్ విజెశేఖర మాట్లాడుతూ.. రాతియుగంలో ఖాళీ బిందెతో నీటి ప్రయాణం ప్రారంభించిన మహిళ 2016వ సంవత్సరం వచ్చినా ఇంటికి చేరలేనట్లుగా పరిస్థితి ఉందన్నారు.
 
ఇదే కాలంలో ప్రపంచం సాధించిన అభివృద్ధిని, మహిళలు సాధించగలిగిన అభివృద్ధిని బేరీజు వేసి చూడాలన్నారు. నివాస ప్రాంతాల్లో నీరు లేనపుడు దానిని తీసుకొచ్చే భారం మహిళలు, బాలికలపై పడుతోందన్నారు. ఇందుకోసం వారు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుని.. సదవకాశాలను కోల్పోతున్నారని చెప్పారు.