బుధవారం, 21 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 డిశెంబరు 2025 (13:25 IST)

జమ్మూకాశ్మీర్, లడాఖ్ భారత్‌లో అంతర్భాగమే.. పాకిస్థాన్ ఉగ్రవాదానికి కేంద్రబిందువు

Jammu Kashmir
Jammu Kashmir
అంతర్జాతీయ సమావేశంలో జమ్మూకాశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రస్తావించింది. అయితే జమ్మూకాశ్మీర్, లడాఖ్ గతంలోనూ, ఇప్పుడూ, భవిష్యత్తులోనూ భారత్‌లో అంతర్భాగమే అని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ గట్టిగా బదులిచ్చారు. అలాగే పాకిస్థాన్​ను ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా పేర్కొన్నారు. భారత్ ప్రజలకు హాని కలిగించడమే లక్ష్యంగా పాకిస్థాన్ ఇలా ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేస్తోందన్నారు. పాకిస్థాన్ దీర్ఘకాలంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశమని హరీశ్ అన్నారు.
 
అలాంటి దేశంతో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం పూర్తిగా సముచిత నిర్ణయమే అవుతుంది. 65 సంవత్సరాల క్రితం భారత్​ సద్భావన, స్నేహ స్ఫూర్తితో ఈ ఒప్పందంలో చేరింది. కానీ గత ఆరున్నర దశాబ్దాలుగా పాకిస్థాన్ మూడు యుద్ధాలు, వేల సంఖ్యలో ఉగ్రదాడులు నిర్వహిస్తూ ఈ ఒప్పంద స్ఫూర్తిని ఉల్లంఘించింది. 
 
గత నాలుగు దశాబ్దాల్లో పాకిస్థాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదం వల్ల పది వేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీలవ జరిగిన పహల్గాం ఘటనే అందుకు నిదర్శనమని హరీశ్ గుర్తు చేశారు.