సంబంధిత వార్తలు
- Chadalavada: పొడ్రూసర్స్ గిల్డ్ విషపురుగు, ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలే ముఖ్యం : చదలవాడ శ్రీనివాసరావు
- మీ కుటుంబ సభ్యులకు ప్రాణహాని తప్పదంటూ నలుగురు ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు
- మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి.. నేతలకు రేవంత్ రెడ్డి బుజ్జగింపు
- హమ్మయ్య.. ఉత్తరాంధ్ర మత్స్యకారులను విడుదల చేసేందుకు బంగ్లాదేశ్ గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ మహిళా మంత్రులను సన్మానించిన మాజీ సీఎం కేసీఆర్... ఎందుకో తెలుసా?
అవినీతిపై డ్రాగన్ కంట్రీ ఉక్కుపాదం... రక్షణ శాఖ మాజీ మంత్రులకు మరణశిక్ష
అవినీతిపై డ్రాగన్ కంట్రీ ఉక్కుపాదం మోపింది. అవినీతికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో ఆ దేశ రక్షణ శాఖ మాజీ మంత్రులకు ఆ దేశ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. అవినీతి వ్యవహారంలో వీ ఫెంగే, లీ షాంగ్‌లపై ఈ మేరకు చర్యలు తీసుకుంది. లంచాలు స్వీకరించిన కేసులో ఫెంగే.. లంచాలు తీసుకోవడంతోపాటు ఇవ్వజూపిన కేసులో షాంగ్ దోషిగా తేలారు. అయితే.. ఈ శిక్ష అమలును కోర్టు రెండేళ్లపాటు నిలిపివేసినట్లు అధికారిక మీడియా వెల్లడించింది.
ఫెంగే.. 2018-23 మధ్యకాలంలో చైనా రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అత్యంత కీలకమైన రాకెట్ ఫోర్స్‌కు అధిపతిగా ఉన్నారు. ఆయన అనంతరం రక్షణశాఖ మంత్రిగా లీ షాంగ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవికి ఆయన్ను స్వయంగా జిన్‌పింగే ఎంపిక చేశారు. కానీ, ఏడాది తిరగకముందే తొలగించారు. అనంతరం షాంగ్ కొన్ని నెలలపాటు కనిపించకుండా పోయారు. 2024లోనే అధికార కమ్యూనిస్టు పార్టీ నుంచి ఈ ఇద్దరినీ బహిష్కరించారు.
చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన అనంతరం పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా.. భారీ అవినీతి నిరోధక ఉద్యమం చేపట్టింది. ఇందులోభాగంగా ఇప్పటివరకు లక్షలాది మంది అధికారులపై చర్యలు తీసుకుంది. ఇందులో అవినీతికి పాల్పడిన ఉన్నతస్థాయి సైనిక అధికారులు కూడా ఉన్నారు.
