గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జులై 2016 (09:30 IST)

సేల్స్ టార్గెట్లు పూర్తి చేయలేదనీ ఉద్యోగులతో కాకరకాయలు తినిపించారు.. ఎక్కడ?

సాధారణంగా ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు టార్గెట్లు ఉంటాయి. ముఖ్యంగా, నిర్ణీత సమయంలోగా తమ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేయని వారికి ఇంక్రిమెంట్లు వేయకుండా, వేతనాల్లో కోతలు విధించడం వంటి

సాధారణంగా ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు టార్గెట్లు ఉంటాయి. ముఖ్యంగా, నిర్ణీత సమయంలోగా తమ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేయని వారికి ఇంక్రిమెంట్లు వేయకుండా, వేతనాల్లో కోతలు విధించడం వంటివి చేస్తుంటారు. మరికొన్ని కంపెనీలు అయితే ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగిస్తుంటాయి. కానీ, చైనాలోని ఓ కంపెనీ.. టార్గెట్లు పూర్తి చేయని తన ఉద్యోగులకు వింతైన శిక్ష విధించింది. ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి శిక్షలు విధించిన దేశాలు లేక పోవడం గమనార్హం. ఆ కంపెనీ విధించిన శిక్ష వివరాలను తెలుసుకుందాం. 
 
నిజానికి విధించిన శిక్షలు వినడానికి, చదవడానికి కాస్త జోక్‌‌గా అనిపించినా వాస్తవం. చైనాలోని చోన్‌‌గింగ్ అనే కంపెనీ ఉద్యోగులకు వీక్లీ టార్గెట్లు పెట్టింది. అయితే ఉద్యోగులెవ్వరూ టార్గెట్ పూర్తి చేయకపోయే సరికి ఆగ్రహించిన యాజమాన్యం అందరినీ వరుసగా నిల్చోబెట్టి 'కాకర కాయలు' తినాల్సిందిగా శిక్ష విధించింది. అంతటితో ఆగని యాజమాన్యం మరో కండీషన్ పెట్టింది. 
 
ఛీ.. కాకరకాయ చేదుగా ఉంది.. నేను తినలేను.. మధ్యలో ఉమ్మేయడం, కింద పడేయడం వంటి పనులు చేస్తే మరిన్ని కాయలు తినాల్సి ఉంటుందన్న నిబంధన పెట్టింది. ఇలా శిక్షలు కేవలం పురుష ఉద్యోగులే కాదు మహిళా ఉద్యోగులకు కూడా విధించింది. సాటి ఉద్యోగుల ముందు ఇలా చేయడంతో తీవ్ర అవమానానికి గురైన ఓ మహిళ ఈ తతంగమంతా వీడియో తీసి నెట్టింట్లో పెట్టింది. దీంతో కంపెనీ దురాగతాలన్నీ వెలుగులోకి వచ్చాయి. అయినా చైనా కార్మిక శాఖ మాత్రం మన్నుతిన్న పాములా ఉండటం గమనార్హం.