1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Death toll jumps to at least 82 in China coal mine blast

చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు - 82 మంది మృతి

deadbody
చైనాలో ఘోరం జరిగింది. ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని లియుషెన్యూ బొగ్గు గనిలో జరిగిన ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో తొలుత మృతుల సంఖ్య తక్కువేనని వార్తలు రాగా.. తాజాగా ఆ సంఖ్య 82కి చేరింది. మరో 9 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి అధికారిక మీడియా ఈ వివరాలను వెల్లడించింది. 
 
షాన్సీ ప్రావిన్స్‌లోని టోంగౌజ్‌ గ్రూప్‌నకు చెందిన లియుషెన్యూ బొగ్గు గనిలో శుక్రవారం రాత్రి 7:30 గంటలకు గ్యాస్‌ లీకై పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో గనిలో 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో కొందరిని రక్షించినట్లు సమాచారం. 
 
ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా 38 మంది గల్లంతయ్యారని శనివారం తెల్లవారుజామున అక్కడి వార్తా సంస్థ పేర్కొంది. అయితే తాజాగా మృతుల సంఖ్య పెరిగిపోయినట్లు అక్కడి మీడియా పేర్కొనడం గమనార్హం. గనిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
ప్రమాదం జరిగిన వెంటనే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ స్పందించారు. గనిలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారికి పూర్తిస్థాయిలో చికిత్స అందించాలన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆత్మహత్యకు ముందు బ్యూటీ పార్లర్‌లో త్విషా శర్మ.. ఎవరైనా ఇలా చేస్తారా?