బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (15:51 IST)

దాడుల సూత్రధారి పారీకర్... కనుసైగతో 38 మంది ఉగ్రవాదుల హతం.. భారత ఆర్మీ మెరుపుదాడి ఎలా?

భారత రక్షణ శాఖామంత్రి మనోహర్ పారీకర్ చేసిన కనుసైగలతో భారత సైన్యం రెచ్చిపోయింది. పాక్ ఆక్మమిత కాశ్మీర్ భూభాగంలో మూడు కిలోమీటర్ల పరిధిలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి జరిపింది. ఈ దాడిలో సు

భారత రక్షణ శాఖామంత్రి మనోహర్ పారీకర్ చేసిన కనుసైగలతో భారత సైన్యం రెచ్చిపోయింది. పాక్ ఆక్మమిత కాశ్మీర్ భూభాగంలో మూడు కిలోమీటర్ల పరిధిలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి జరిపింది. ఈ దాడిలో సుమారు 40 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. 
 
యురీ ఉగ్రదాడితో పాకిస్థాన్ పట్ల భారత్ గుర్రుగా ఉన్న విషయంతెల్సిందే. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాల మెరుపుదాడులు చేశాయి. ఈ దాడులంతా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కనుసన్నల్లోనే జరిగాయి. ఈ విషయాన్ని భారత సైన్యం ప్రకటించింది. టార్గెట్‌ల ఎంపిక నుంచి మొదలుకొని మొత్తం ప్రక్రియ అంతా పారికర్ అబ్జర్వేషన్‌లోనే నిర్వహించారు. 
 
ఎంచుకున్న ఏడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టి భారత బలగాలు విజయవంతంగా తిరిగి వచ్చేదాకా అంతా పారికర్‌ కనుసన్నల్లోనే జరిగింది. బుధవారం త్రివిధ దళాధిపతులతో కీలక భేటీలోనే భారత బలగాలు జరపబోయే ఆపరేషన్‌ గురించి మినిట్‌ టు మినిట్ ప్రోగ్రాం పారికర్ చేతుల్లో ఉందని రక్షణ వర్గాల ద్వారా తెలిసింది.
 
మరోవైపు... అర్థరాత్రి వేళ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అడుగుపెట్టిన భారత బలగాలు ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసి 38 మంది ఉగ్రవాదులను హతం చేశాయి. కనీసం 7 ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేశాయి. నియంత్రణ రేఖను ఆనుకుని మూడు కిలోమీటర్ల లోపలి దాకా జొచ్చుకెళ్లిన భారత కమెండోలు వీర విహారం చేశారు. పక్కా టార్గెట్‌లపైనే విరుచుకుపడ్డారు. ఉగ్రవాద పీచమణిచారు. విజయవంతంగా శతృసంహారాన్ని పూర్తిగా చేశారు. 
 
సహనం, సంయమనం పాటించే రోజులు పోయాయి. ఇప్పటికీ ఉగ్రవాదులకు సహకరించాలని పాకిస్థాన్ అనుకుంటే గట్టి మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితులు వచ్చాయి. బుధవారం రాత్రి భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి జరిపిన దాడులతో ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పఠాన్‌కోట్, యురి దుర్ఘటనల అనంతరం భారత సైన్యం ఈ దాడులు చేయడంతో సైన్యం ఆత్మవిశ్వాసం బలపడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.