నెతన్యాహుపై ఇరాన్ ఖైబర్ క్షిపణులతో మెరుపు దాడి చేసిందా? కార్యాలయం ధ్వంసమైందా?
ఇరాన్ పైన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేసిన నేపధ్యంలో ఇరాన్ మెరుపుదాడులు చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ దేశంలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అధునాతన క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం, ఎయిర్ ఫోర్స్ కమాండర్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ దాడులు చేసినట్లు వెల్లడించింది.
ఈ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పూర్తిగా ధ్వంసమైందని వారు పేర్కొన్నారు. ఐతే ఈ వార్తలను ఇజ్రాయెల్ ఖండించింది. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సోమవారం నాడు మధ్యాహ్నం జెరూసలెం సమీపంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినమాట వాస్తవమేనని స్థానికులు వెల్లడించారు.