1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Donald Trump downplays talks for ceasefire deal with Iran, claiming military victory.

వ్యూహాత్మకంగా ఇరాన్‌పై విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్

donald trump
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. 21 గంటల పాటు  సుధీర్ఘంగా జరిగిన ఈ చర్చల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం తనదైనశైలిలో స్పందించారు. ఇరాన్‌తో జరిగిన చర్చల ఫలితంలా ఉన్నప్పటికీ తాము వ్యూహాత్మకంగా విజయం సాధించామని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు 21 గంటలకు పైగా జరిగాయి. ఈ భేటీలో అమెరికా ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లతో పాటు పలువురు జాతీయ భద్రతా నిపుణులు నాయకత్వం వహించారు. వాషింగ్టన్ నుంచి మరికొందరు నిపుణులు వీరికి సహకారం అందించారు. 
 
మరోవైపు వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఈ చర్చలపై సూటిగా, ఘాటుగా స్పందించారు. 'ఫలితం ఎలా ఉన్నా, మేమే గెలుస్తాం. మేము ఆ దేశాన్ని (ఇరాన్‌) పూర్తిగా ఓడించాం. ఫలితంతో సంబంధం లేకుండా అమెరికా కోణంలో చూస్తే మేం గెలిచాం' అని ఆయన అన్నారు.
 
ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తాము పూర్తిగా నిర్వీర్యం చేశామని ట్రంప్ పేర్కొన్నారు. 'మేము వారి నౌకాదళాన్ని, వైమానిక దళాన్ని ఓడించాం. వారి నాయకులందరూ చనిపోయారు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. 
 
అలాగే, హర్మూజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన సీ మైన్స్‌ను తొలగించడానికి అమెరికా దళాలు 'మైన్ స్వీపర్ల'తో గస్తీ కాస్తున్నాయని కూడా ఆయన తెలిపారు. ఈ చర్చలను ఆర్థిక పరిణామాలతో ముడిపెట్టిన ట్రంప్, అమెరికా వైపు భారీ ట్యాంకర్లు చమురు, గ్యాస్ కోసం వస్తున్నాయని, ఇది చూడటానికి ఎంతో అందంగా ఉందని పేర్కొన్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. బాలికలదే పైచేయి..