1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Donald Trump's Calm Before Storm Warning Amid Reports Of US Action Against Iran

తుఫాను వచ్చే ముందు అంతా ప్రశాతంగానే ఉంటుంది : డోనాల్డ్ ట్రంప్

trump warn iran
ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు గట్టి హెచ్చరిక చేశారు. తుఫాను వచ్చే ముందు అంతా ప్రశాంతంగానే ఉంటుందంటూ ఏఐ ఫోటోతో ఆయన ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత ఫిబ్రవరి నెల నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోమారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై వైమానిక దాడులను పునఃప్రారంభించడంపై ట్రంప్‌ తన యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన హెచ్చరికలు చేయడం గమనార్హం. 
 
కృత్రిమమేథతో రూపొందించిన ఫొటోను ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. ఆ ఫొటోలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో యుద్ధనౌకలు ప్రయాణిస్తున్నాయి. అక్కడే ట్రంప్‌, ఆయన పక్కన ఒక యూఎస్‌ నేవీ అడ్మిరల్‌ నిలబడి ఉన్నారు. ఆ సముద్రంలో ఉన్న నౌకలపై ఇరాన్‌ జెండాలు ఉండటం గమనర్హం. దీనికి తుఫానుకు ముందు ప్రశాంతంగానే ఉంటుందని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ పెట్టారు. 
 
అమెరికా - ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. హర్మూజ్‌ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో దాడులు పునఃప్రారంభించడంపై ఆయన చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తుండగా.. ఆయన ఈ ఫొటో పంచుకోవడం ఆందోళనలను పెంచుతోంది.  
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. ప్రయాణికులకు తప్పిన ముప్పు