సంబంధిత వార్తలు
- హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన
- బంగ్లాదేశ్‌లో వైరల్ అవుతున్న తెల్ల దున్నపోతు పేరు డొనాల్డ్ ట్రంప్ అంట... ఎందుకంటే?
- ట్రంప్ పోలికలతో దున్నపోతు... షేర్ చేసిన ఇరాన్ ఎంబసీ (వీడియో)
- డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర?
- ఇరాన్‌తో ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదు : నెతన్యాహూ - ట్రంప్ మధ్య వాగ్వాదం
శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా అంటూ అల్టిమేటం జారీచేశారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దేశాల మధయ శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో కీలకాశం యురేనియం. ఇరాన్ శుద్ధి చేసిన ఆ యురేనియాన్ని అమెరికాకు అప్పగించాలని లేకపోతే నాశనం చేయాలని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ట్రూత్‌లో పోస్ట్ పెట్టారు.
'శుద్ధి చేసిన యురేనియంను నిర్వీర్యం చేసేందుకు అమెరికాకు అప్పగించాలి. లేకపోతే అటామిక్ ఎనర్జీ కమిషన్ లేక దాని సమానస్థాయి సంస్థ ఇరాన్‌తో సమన్వయం చేసుకొని.. ఒక ఆమోదయోగ్యమైన ప్రదేశంలో దానిని నాశనం చేయాలి' అని ట్రంప్ రాసుకొచ్చారు. తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాము అణ్వాయుధం కోసం వెంపర్లాడటం లేదని ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు.
భవిష్యత్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిని కాదు.. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్‌ను మాత్రమే : జేడీ వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను అమెరికా భవిష్యత్ అభ్యర్థిని కాదనని ప్రస్తుత ఉపాధ్యక్షుడు మాత్రమేనని చెప్పారు. పైగా, వైట్‍హౌస్‌లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. దీంతో విదేశాంగ విధానాలకు ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో 2028లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికలను కూడా వాన్స్ వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను భవిష్యత్తు అధ్యక్ష అభ్యర్థిని కాదని, ప్రస్తుత ఉపాధ్యక్షుడినని వ్యాఖ్యానించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే 2028 అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం కొంతకాలంగా వాన్స్‌కు మార్కో రూబియోతో తెర వెనుక రహస్య పోటీ జరుగుతోందని మీడియా వర్గాలు వెల్లడించాయి.
వాన్స్ తన నిర్ణయాలను మార్చుకోవడానికి అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఇటీవల క్యాబినెట్ నుంచి వైదొలగడం కూడా ప్రధాన కారణమని మీడియా కథనాలు వెల్లడించాయి. అమె పదవి నుంచి దిగిపోవడం వల్ల విదేశీ వ్యవహారాల విషయంలో వ్యూహాలను పంచుకోవడానికి అనుభవజ్ఞులైన అధికారులు లేకుండాపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్‌తో యుద్ధం విషయంలోనూ వాన్స్ ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు.. యుద్ధాన్ని ముగించాలని సూచిస్తున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.
ఇరాన్‌పై యుద్ధం గురించి ఇటీవల వాన్స్ మాట్లాడుతూ.. అందరికీ అణ్వాయుధాలు కావాలనుకుంటే ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ క్రమంలోనే విదేశాంగ నిర్ణయాలపై వాన్స్ అనుసరిస్తున్న విశ్లేషణాత్మక విధానాలపై ట్రంప్ అసహనంగా ఉన్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇరాన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ట్రంప్ ఆ దేశంపై దాడుల ప్రణాళికలను పంచుకుంటున్నట్లు పేర్కొన్నాయి.
