సంబంధిత వార్తలు
- పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు : యూఎస్ స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్
- అమెరికా రాజకీయాల్లోకి భారతీయ మూలాలున్నవారు రావాలి : రాజా కృష్ణమూర్తి
- గడ్డి కోతకు వేతనం రూ.10 లక్షలా?... ఎక్కడ? (Video)
- ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన రైల్వే ఉద్యోగిని.. వీడియో వైరల్ సస్పెండ్
- Narendra Modi: అల్లు అర్జున్ పై ద్రుష్టి సారిస్తున్న ప్రధాని నరేంద్ర మోడి
రూ.1.9 కోట్ల వేతనం.. చాక్లెట్ కుకీన దొంగిలించిన ఉద్యోగి - తొలగించిన కంపెనీ
ఓ చిన్నపాటి చాక్లెట్ కుకీని చోరీ చేసినందుకు కంపెనీ యజమాన్యం తీవ్ర నిర్ణయం తీసుకుంది. తమ కంపనీలో రూ.1.9 కోట్ల వేతానాన్ని అందుకుంటున్న ఉద్యోగిని నిర్దాక్షిణ్యంగా తొలగించింది. ఇంత కఠిన నిర్ణయం తీసుకున్న కంపెనీ ఫోర్డ్. ఈ ఘటన అమెరికాలో వెలుగులోకి వచ్చింది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, కెంటకీలోని లూయిస్‌విల్లేలో ఉన్న ఫోర్డ్ ట్రక్ ఫ్యాక్టరీలో.. 60 యేళ్ల కర్ట్ క్రోమ్ 11 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఎంతో విధేయతగా సగటున వారానికి 60 గంటలు పనిచేసేవాడినని.. అయినప్పటికీ తప్పుడు ఆరోపణలతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను కంపెనీలో రూ.1.9 కోట్లు సంపాదిస్తున్నానని.. గతేడాది ఆఫీస్ క్యాంటీన్‌లో సుమారు రూ.1.14 లక్షలు ఖర్చు చేశానని తెలిపాడు. ఇటీవల కంపెనీలో ఉన్న సమయంలో షుగర్ లెవల్స్ పడిపోతున్నట్లు అనిపించడంతో ఓ చాక్లెట్ కుకీ (రూ.186)ని కొనుగోలు చేశానని పేర్కొన్నాడు.
కొద్ది రోజుల అనంతరం సూపర్‌వైజర్ తనను పిలిచి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పాడని.. కారణమేంటని అడగ్గా కుకీని దొంగలించినందుకు జాబ్ నుంచి తీసేస్తున్నట్లు పేర్కొన్నాడని వెల్లడించాడు. తాను కుకీని దొంగలించలేదని.. దానిని కొనుగోలు చేసినట్లు తన వద్ద బిల్లు ఉందని చెప్పినప్పటికీ బలవంతంగా ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచి బయటకు పంపేశారని ఆరోపించాడు.
ఆ బిల్లు స్క్రీన్‌షాట్ పంపించిన అనంతరం తాను నిర్దోషిగా తేలడంతో ఉద్యోగానికి తిరిగి రావాలని యూనియన్ ప్రతినిధి పిలిచారని బాధితుడు వెల్లడించాడు. కానీ తనను అవమానించిన చోట పని చేయకూడదని నిర్ణయించుకున్నట్లు అతడు వెల్లడించాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఉద్యోగి పట్ల ఫోర్డ్ అధికారుల తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు.
