మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 16 జులై 2016 (13:40 IST)

ఇస్లామిక్ స్టేట్‌తో వార్‌కు రె ''ఢీ''.. మూడో ప్రపంచ యుద్ధంలా?!: ట్రంప్, హిల్లరీ

ఇస్లామిక్ స్టేట్‌తో వార్‌కు అమెరికా రెడీ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఐఎస్‌తో యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు. ఫ్

ఇస్లామిక్ స్టేట్‌తో వార్‌కు అమెరికా రెడీ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఐఎస్‌తో యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్‌లోని నీస్ ఘటనను ఖండించిన వారిద్దరూ.. శాంతిభద్రతలపై నమ్మకం లేదని.. ఇక కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. చూస్తుంటే ఇది ప్రపంచ యుద్ధంలానే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
 
వరల్డ్ ట్రేడ్ సెంటర్, శాన్ బెర్నార్డినో, పారిస్, ఓర్లాండ్ ఘటనలను పరిశీలిస్తే.. పరిస్థితి మరింత దిగజారుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. తానే కనుక అమెరికా అధ్యక్షుడినైతే ఐఎస్‌పై యుద్ధానికి వెనుకాడే ప్రసక్తే లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.  ఐఎస్ ఉగ్రవాదులను ఇక్కడి నుంచి వెళ్లగొడితే మరో ప్రాంతం నుంచి దాడులు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని అని హిల్లరీ చెప్పుకొచ్చారు. 
 
ఇస్లాంను తెగ వాడేసుకుంటున్న జిహాదీలు.. టెర్రరిస్టులతో ప్రపంచ దేశాలపై యుద్ధం చేస్తుందని.. అందుకే టెర్రరిస్ట్ గ్రూపులు, రాడికల్ జిహాదిస్ట్ గ్రూపులపై యుద్ధం చేసే సమయం ఆసన్నమైందని హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. ప్రజలు దీనిని మూడో ప్రపంచ యుద్ధంగా అభివర్ణిస్తున్నారని హిల్లరీ క్లింటన్ వెల్లడించారు.