సంబంధిత వార్తలు
- పవర్ లిఫ్టింగ్ లో టర్కీలో ఏషియన్ గేమ్స్ లో పాల్గొంటున్న నటి ప్రగతి
- భారత్ - పాక్‌ల మధ్య కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలి : టర్కీ ప్రెసిడెంట్
- తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!
- Influencer: టర్కీలో పబ్లిక్ ప్లేసులో చీరకట్టుకున్న మహిళా ఇన్ఫ్లుయెన్సర్ (video)
- భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం
నాకు అందమైన అమ్మాయిని, బిలియన్ డాలర్ల డబ్బు పంపించండి: ఉగాండా ఆర్మీ చీఫ్ హుకుం
ఉగాండా దేశ సైన్యాధిపతి జనరల్ ముహూజ కైనెరుగాబా చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్లు నుంచి రక్షణ కల్పించడానికి ఉగాండా అందిస్తున్న సేవలకు గానూ ఒక బిలియన్ డాలర్ల నగదు చెల్లించాలని తుర్కియేను డిమాండ్ చేశారు. నగదుతో పాటు తను పెళ్లి చేసుకోవడానికి, దేశంలోనే అత్యంత అందమైన అమ్మాయిని అప్పగించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తమ డిమాండ్లను 30 రోజుల్లో అంగీకరించకపోతే తీవ్రమైన దౌత్య పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అలాగే, నిర్ణీత గడువులోగా డిమాండ్లు పరిష్కరించని పక్షంలో ఉగాండాలోని ఆ దేశ రాయబార కార్యాలయాన్ని సైతం మూసివేస్తామని, తమ గగనతలంలోని తుర్కియే ఎయిర్‌లైన్స్ కార్యాకలాపాలు నిలివేస్తామన్నారు.
తుర్కియేతో ఉగాండాకు ఉన్న సంబంధాలన్నీ త్వరలో తెంచుకుంటామని కైనెరుగాబా అన్నారు. వెన్నుపోటు పొడిచే స్నేహితుడిని తాము కోరుకోవట్లేదంటూ వ్యాఖ్యానించారు. తుర్కియేకు అన్ని ప్రయాణాలు నిలిపేసుకోవాలని దేశ ప్రజలకు సూచించారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు సాయంగా లక్ష మంది సైనికులను పంపనున్నట్లు తెలిపారు.
కాగా, కైనెరుగాబా స్త్రీలను ఉద్దేశించి ఇలాంటి విపరీతమైన డిమాండ్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో ఇదేవిధంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనిని వివాహం చేసుకుంటానని బహిరంగంగా ప్రకటించారు. ఆమెను తనకు అప్పగిస్తే.. బదులుగా ప్రపంచంలోనే అత్యంత అందమైన ఆవులుగా పేరుపొందిన 100 అంకోలే జాతి ఆవులను ఇస్తానని ఆఫర్ చేశారు.
అనంతరం కైనెరుగాబా వ్యాఖ్యలకు గానూ అతడి తండ్రి, ఉగాండా అధ్యక్షుడు అయిన యోవేరి ముసెవెని బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు తుర్కియే స్పందించలేదు.
తర్వాతి కథనం
