గ్రీన్‌ల్యాండ్ బూమ్ రాంగ్, ట్రంప్‌కి పిచ్చెక్కిస్తున్న నాటో దేశాలు
వెనిజులా దేశంపై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని చెరబట్టి, వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ రొమ్ము విరుచుకుని చెప్పారు ట్రంప్. అదే ఊపుతో గ్రీన్ ల్యాండ్ కూడా ఆక్రమించుకుని అందులోని అమూల్యమైన ఖనిజ సంపదను కొల్లగొట్టే ప్లాన్ వేసారని వాదన వచ్చింది. దీనితో ఇప్పుడు నాటోలో వున్న అమెరికా మిత్ర దేశాలే ట్రంప్ పైన ధ్వజమెత్తుతున్నాయి. గ్రీన్ ల్యాండ్ వ్యవహారం కాస్తా బూమ్‌రాంగ్ అవుతోంది.
మరోవైపు అమెరికాలో సైతం గ్రీన్ ల్యాండ్ వ్యవహారంపై 75 శాతం ప్రజలు విముఖతగా వున్నట్లు ఓ సర్వే తేల్చింది. ఈ నేపధ్యంలో గ్రీన్ ల్యాండ్ పైన దాడి చేయకుండా ఆ దేశాన్ని డబ్బుతో కొనుగోలు చేయాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్రీన్ ల్యాండ్ ప్రాంతంలో వుంటున్నవారికి డబ్బు ఆశ చూపి లాగేయాలని చూస్తున్నారన్న వార్త బైటకు రాగానే డెన్మార్క్ తన మిత్ర దేశాలను అప్రమత్తం చేసింది.
ఫలితంగా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నార్వే దేశాలు గ్రీన్‌ల్యాండుకి తమ సైన్యాన్ని పంపింది. అలా మిత్ర దేశాలైన యూరప్ దేశాలు కాస్తా ట్రంప్‌కి వ్యతిరేకంగా మారడంతో నాటో బీటలు వారుతుందన్న వాదనకు బలం చేకూరుతోంది.