ఫ్లోరిడాలో 15 రోజుల పాటు మృత్యువుతో పోరాటం.. హనుమకొండ వ్యక్తి మృతి
Hanamkonda
జూలై 25న ఫ్లోరిడాలో జరిగిన అగ్ని ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తర్వాత, బుధవారం ఆసుపత్రిలో అతను మరణించాడు. భరత్ చందర్ రెడ్డి మరణంతో గుంటూరుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తమ కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. భరత్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
