1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Helicopter-s tail snaps off; it spins wildly on the ground, tossing the pilots around like dolls, Video

తోక తెగి కిందపడ్డ హెలికాప్టర్, నేలపై గిరికీలు కొడుతూ పైలెట్లను బొమ్మల్లా ఆడించింది, వీడియో

Helicopter accident
చైనాలో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. తోక తెగి కిందపడ్డ హెలికాప్టర్, నేలపై గిరికీలు కొడుతూ పైలెట్లను బొమ్మల్లా ఆడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫుటేజీలో, హెలికాప్టర్ ఒక పచ్చని మైదానంలో కూలిపోయి రెండు ముక్కలుగా విరిగిపోయింది. అయినప్పటికీ దాని రోటర్ బ్లేడ్లు చాలాసేపటి వరకు వేగంగా తిరుగుతూనే ఉన్నాయి.
 
కాక్‌పిట్‌లో చిక్కుకున్న పైలట్, అతని సహచరుడు తీవ్రంగా అటూ ఇటూ విసిరివేయబడుతూ కనిపించారు. ఒక పైలట్ హెలికాప్టర్ డోర్ నుండి సగం బయటకు వేలాడుతూ, పదేపదే నేలను విమానం అంచును ఢీకొంటూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసిన సమీపంలోని రోడ్డుపై ఉన్న ప్రజలు గుమిగూడారు. కానీ రోటర్ బ్లేడ్లు ఇంకా తిరుగుతూ ఉండటంతో సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేకపోయారు.
 
సీట్‌ బెల్టులు పెట్టకోవడం వల్ల ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన చైనాలోని వుజిన్ నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగింది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
కేశినేని బ్రదర్స్ గొడవ : తమ్ముడు ఫిర్యాదుతో అన్నపై కేసు