ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మార్చి 2026 (19:03 IST)

ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్.. గేర్ విరిగి చక్రం విడిపోయింది.. తర్వాత? (video)

Air India
Air India
థాయిలాండ్‌లోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ విమానం రన్‌వేపైకి దిగగానే నోస్ గేర్ విరిగిపోయి ముందు చక్రం విడిపోయింది. విమానం హైదరాబాద్ నుండి ఫుకెట్‌కు వెళుతుండగా బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
థాయ్ మీడియా ప్రకారం.., ఈ సంఘటన తర్వాత రన్‌వేను కొంతకాలం మూసివేయాల్సి వచ్చింది. అయితే, విమానంలో ఉన్న 133 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. వారికి ఎటువంటి గాయాలు ఏర్పడలేదు.
 
విమానం షెడ్యూల్ కంటే ముందే ఫుకెట్‌కు చేరుకుంది. విమానం ల్యాండింగ్ సమయం ఉదయం 11:40, కానీ అది ఉదయం 11:24 గంటలకు ల్యాండ్ అయింది. విమానం చాలా త్వరగా ల్యాండ్ అయిందని, ముందు ల్యాండింగ్ గేర్ పాడైందని అధికారులు తెలిపారు. చక్రం విడిపోవడం వల్ల విమానాన్ని వెంటనే రన్‌వే నుండి తొలగించలేకపోయారు.