మంగళవారం, 2 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 1 డిశెంబరు 2025 (21:47 IST)

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Lion attacked on man
జంతువులు వుండే జంతు ప్రదర్శన శాలలో ఓ భీతావహ సంఘటన జరిగింది. సింహం వుండే డెన్ లోకి ఓ వ్యక్తి ఆ జంతువును మరింత దగ్గరగా చూసేందుకు ఫెన్సింగ్ దూకి లోపలికి వెళ్లాడు. అలా ఫెన్సింగ్ దూకి లోనికి ప్రవేశిస్తున్న వ్యక్తిని చూసిన సింహం ఒక్క ఉదుటున అతడి వద్దకు పరుగెత్తింది. అతడు చెట్టు కొమ్మ పైనుంచి క్రిందికి జారడంతో అతడిపై పంజా విసిరింది.
 
ఆ వ్యక్తి పొదల్లో దాక్కునేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ అతడిపై దాడి చేసి చంపేసింది. జూ సిబ్బంది అదుపు చేసేందుకు యత్నించే లోపుగానే అతడిని చంపి పీక్కుని తినేసింది. ఈ భయానక సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ దారుణం బ్రెజిల్ దేశంలోని పార్క్ అరూడా కామరా జూలో జరిగింది.