1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. How Will America Win, Iran Shoots Down ₹150 Crore Aircraft with a Small Missile

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

Iran Shoots Down Very Big Aircraft with a Small Missile
ఇరాన్ దేశం పైన అమెరికా ఇప్పుడప్పుడే విజయం సాధించే దాఖలాలు కనిపించటం లేదు. పైగా కోట్లు విలువ చేసే అత్యాధునిక ఆయుధాలను ఇరాన్ గడ్డిపోచలా పరిగణించడమే కాకుండా వాటిని చాలా సింపుల్ గా కూల్చేస్తోంది. అందుకోసం ఇరాన్ వాడుతున్నది చాలా చాలా తక్కువ ఖరీదైన అస్త్రాలు అని సమాచారం వస్తోంది. తాజాగా ఇరాన్ మీద దాడులకు ఉపయోగించిన రూ. 150 కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని ఇరాన్ గగనతలంలోనే కూల్చేసింది.
 
ఇందుకోసం ఇరాన్ వాడిన ఆయుధం చిన్నసైజు బాణం లాంటిదని చెబుతున్నారు. ఆ పరికరం అంతరిక్షంలోనే శత్రు దేశాలకు సంబంధించిన ఆయుధాన్ని దేన్నైనా కూల్చేస్తుందని ఇరాన్ చెబుతున్నట్లు పలు ఛానళ్లలో సమాచారం వస్తోంది. ఈ రక్షణ వ్యవస్థ పేరు అరాశ్ అంట. అరాశ్ అంటే బాణం అని అర్థం. పూర్వం ఇరాన్ దేశంలో అరాశ్... ది ఆర్చర్ అనే యోధుడు వుండేవాడట. పశ్చిమ దేశాల ప్రభావాన్ని ఇరాన్ దేశం పైన పడకుండా వుండేందుకు అతడు శక్తివంతమైన బాణాలతో పోరాడాడట.
 
ఈ బాణాన్ని అతడు ప్రయోగించినపుడు మధ్య ఆసియాలోని ఓ నది అవతల వున్న ఓ చెట్టుని తాకిందనీ, అలా తాకడంతోనే అదే సరిహద్దుగా మారిందని ఇరాన్ గాధల్లో వుంది. ఇప్పుడు ఆ పేరుతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆ వ్యవస్థను పసిగట్టడంలో అమెరికా విఫలమవడం వల్లనే అత్యంత ఖరీదైన ఆయుధ సంపత్తిని కోల్పోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?