ఇప్పుడు వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే: ట్రంప్ సంచలన పోస్ట్
అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలకు రోజుకో ఆశ్చర్యకర విషయాన్ని చెపుతున్నాడు. వెనెజులా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్న ట్రంప్ తిన్నగా ఇప్పుడు మరో షాకింగ్ పోస్ట్ పెట్టాడు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. జనవరి 2026 నుంచి బాధ్యతలు అని ట్యాగ్ లైన్ పెట్టారు. అందులోనే ఆయన పేర్కొంటూ.. వెనిజులా దేశంలో సురక్షితమైన అధికార మార్పిడి జరిగే వరకూ ఆ దేశ అధ్యక్షుడిని నేనే అంటూ వెల్లడించారు.
ఈ సమయంలో అమెరికా దేశం వెనిజులాలో అన్ని కార్యక్రమాలను నడుపుతుందనీ, అక్కడి చమురు నిల్వలు వాటికి సంబంధించిన ఆదాయంపైన కూడా అమెరికా చూసుకుంటుందని తెలిపారు. వెనిజులా అధ్యక్షుడిని చెరబట్టాక ట్రంప్ ఈ పోస్ట్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక దేశానికి అధినేత అయివుండి మరో దేశానికి తాత్కాలిక అధ్యక్షుడినని ప్రకటించుకున్న వ్యక్తి ఇప్పటివరకూ ఎవ్వరూ లేరు. అది ఒక్క ట్రంప్ మాత్రమే. దీనిపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తున్నది చూడాల్సి వుంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా బందీ చేస్తే పోలా...
నియంతల వెన్నును ఎలా విరగ్గొట్టాలో అమెరికాకు బాగా తెలుసు. నెక్ట్స్ ఏం చేయాలో కూడా వారికి బాగా తెలుసు అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పరోక్షంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశించి మాట్లాడారు. వెనెజులా అధ్యక్షుడు మదురోను ఎలా బందీ చేసారో అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా బందీ చేస్తే పోలా అన్నట్లు వ్యాఖ్యానించారు. ఈ మాటలకు ట్రంప్ నోరు నొక్కుకున్నారు. వెంటనే స్పందిస్తూ... పుతిన్‌తో కూర్చుని చక్కగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవచ్చు. రష్యాకు ఐరోపా దేశాలంటే అస్సలు భయం లేదు కానీ అమెరికా అంటే రష్యాకు గుండెల్లో దడ వస్తుంది. కనుక మేమిద్దరం ఒకరికొకరు సహకరించుకుంటాం. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇంతకాలం జరగడం చాలా బాధగా వుంది. లక్షల్లో సైనికులు మరణిస్తున్నారు. త్వరగా యుద్ధానికి ఇరుదేశాలు స్వస్తిపలకాలి అంటూ చెప్పుకొచ్చారు ట్రంప్.