సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 4 మార్చి 2026 (20:33 IST)

యుద్ధంలో ఇరాన్ ఓడితే తర్వాత టార్గెట్ మేమే: పాకిస్తాన్ రక్షణ మంత్రి

Pakistan defence minister
ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు చేస్తున్నాయి. ఈ భీకర దాడుల్లో ఇరాన్ బాగా దెబ్బ తింటోంది. ఐతే ఇరాన్ కూడా తగ్గడంలేదు. తన శక్తిమేర ఇజ్రాయెల్ దేశంపైనా, గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్‌ల పైనా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఐతే ఇరాన్ పని అయిపోతుందని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
 
పాకిస్తాన్ దేశాన్ని ఓ తోక దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. ఈ కుట్రలో ఆఫ్ఘనిస్తాన్, భారత్ భాగస్వామిగా వున్నాయని అన్నారు. ఇరాన్ కనుక యుద్ధంలో ఓడితే ఇక ఇజ్రాయెల్ దేశంతో పాకిస్తాన్ దేశానికి కష్టాలు తప్పవని అన్నారు. ఇక అప్పుడు భారత్, ఆఫ్ఘన్, ఇజ్రాయెల్ ఒక్కటై పాకిస్తాన్ పైన దాడి చేస్తాయంటూ ఆయన ఆరోపణలు చేసారు.