శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 16 ఆగస్టు 2015 (11:04 IST)

పాకిస్థాన్ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన భారత హ్యాకర్లు

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కేవలం సరిహద్దుల్లోనేకాకుండా అంతర్జాయం వేదికగా కూడా యుద్ధం సాగుతోంది. తాజాగా, పాకిస్థాన్‌కు భారత హ్యాకర్లు సరైన గుణపాఠం నేర్పారు. భారత సైబర్ స్పేస్‌పై దాడులకు పాల్పడవద్దని పాకిస్థాన్ హ్యాకర్లను హెచ్చరించారు. 
 
ఇందుకు ప్రతీకారంగా 100కు పైగా ఆ దేశ బిజినెస్ వెబ్ సైట్లను హ్యాక్ చేసినట్టు 'హెల్ షీల్డ్ హ్యాకర్స్' అనే గుర్తు తెలియని హ్యకింగ్ గ్రూప్ వెల్లడించింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ దాడి చేసినట్టు హ్యాకర్స్ గ్రూప్ నిర్వాహకులు తెలిపారు. 
 
భారత సైట్లను హ్యాక్ చేయడానికి పాక్ ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. పాక్ హ్యాకర్లకు తామిచ్చింది చిన్న సమాధానమేని వారు తెలిపారు. బ్లాక్ హ్యాట్ టీమ్ పేరిట ఇప్పటివరకూ 1000కి పైగా భారత సైట్లను వారు హ్యాక్ చేశారని తెలిపారు. పాక్ హ్యాకర్లు పూర్తి స్థాయిలో సైబర్ దాడులకు సిద్ధమైతే, తామూ అదే పని చేస్తామని హెచ్చరించారు.