ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్న హైస్కూల్ ఉద్యోగిని
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఓ హైస్కూల్ ఉద్యోగిని ఇద్దరు విద్యార్థులతో అనుచిత లైంగిక సంబంధం పెట్టుకుంది. దీంతో ఆమెను ఆ దేశ పోలీసులు అరెస్టు చేయడం స్థానికంగా కలకలం రేపింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాండాల్ఫ్ ఈస్టర్న్ స్కూల్ కార్పొరేషన్‌లో సెక్రటరీగా పని చేసే 31 యేళ్ల అలిసియా హ్యూసెజ్ అనే ఉద్యోగిని 18 యేళ్ళ విద్యార్థితో అనుచితంగా ఉండగా ఆమె భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వారి మద్య వాగ్వాదం జరగడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. కుటుంబ కలహం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
అలిసియాకు 18 యేళ్ళు, 17 యేళ్ల వయస్సున్న ఇద్దరు విద్యార్థులతో సంబంధం ఉన్నట్టు తేలింది. ఆ మైనర్ విద్యార్థి కనీం ఐదుసార్లు లైంగిక చర్యలో పాల్గొన్నట్టు ఆధారాలు కూడా లభించాయి. దీంతో ఆమెపై ఐదు అభియోగాలు నమోదు చేసి చైల్డ్ సెడక్షన్ కేసు నమోదు చేసి, రాండాల్ఫ్ కౌంటీ జైలుకు తరలించారు. అయితే, విద్యార్థుల గోప్యత దృష్ట్యా వారి పేర్లు, వ్యక్తిగత వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు.