1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Iran claims to shot down 'hostile aircraft' near Strait of Hormuz

ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు యుద్ధం.. యూస్ వార్ ఫ్లైట్‌ను కూల్చేసిన ఇరాన్

Iran
అమెరికా ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు ఈ చర్చలు ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరుగుతుంటే మరోవైపు, ఇరాన్, అమెరికా దేశాలు యుద్ధక్షేత్రంలో తలపడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. మరోవైపు, అమెరికా యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. ఈ విధంగా అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల వేళ ఇరాన్‌ అధికారిక మీడియా కీలక ప్రకటన చేసింది. 
 
అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చేశామని ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనను అగ్రరాజ్యం ఖండించింది. అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేసింది. శుక్రవారం తెల్లవారుజామున బుషెహర్‌ ప్రావిన్స్‌లోని జామ్‌ ప్రాంతంలో శత్రు దేశానికి చెందిన ఓ యుద్ధ విమానాన్ని అడ్డగించినట్లు టెహ్రాన్‌ మీడియా తెలిపింది. ఇరాన్‌ వైమానిక దళాలు ఆ ఫైటర్‌జెట్‌ను కూల్చివేశాయని స్థానిక గవర్నర్‌ను ఉటంకిస్తూ వెల్లడించింది. 
 
ఈ ఘటనలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా.. లేదా అనే పూర్తి వివరాలను మాత్రం అది వెల్లడించలేదు. ప్రస్తుతం బుషెహర్‌ ప్రాంతంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని తెలిపింది. మరోవైపు, దాడుల్లో యుద్ధ విమానం కూలిపోతున్న ఓ ఫొటోను ఇరాన్‌ ఆర్మీ ఎక్స్‌ ఖాతాలో పంచుకుంది. అయితే, ఈ వాదనలను అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తోసిపుచ్చింది. బుషెహర్‌ ప్రావిన్స్‌ సమీపంలో అమెరికా విమానాన్ని కూల్చేశామంటూ ఇరాన్‌ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడింది. 
About Writer
ఠాగూర్