సంబంధిత వార్తలు
- గన్‌ఫైర్‌ను తప్పించుకుని సురక్షితంగా భారత్‌కు చేరిన చమురు ట్యాంకర్
- యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ
- పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు : యూఎస్ స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్
- మొన్ననే గోవాలో కలిశాను... ఆప్యాయంగా మాట్లాడారు : భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి
- ఖుష్బూ కుమార్తె పెళ్లికి త్రిష, ఖాళీగా పక్కసీటు, అది ఎవరికోసం?
టెహ్రాన్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భౌతికకాయం తరలింపు
అమెరికా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అత్యక్రియలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఫిబ్రవరి 28వ తేదీన ఆయన హత్యకు గురైన ప్రదేశానికి చేర్చారు. 'ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఖమేనీ భౌతికకాయాన్ని ఆయన అమరత్వం పొందిన ప్రదేశానికి తరలించారు' అని ఇరాన్ మీడియా వెల్లడించింది.
టెహ్రాన్‌లో జులై 4,5 తేదీల్లో జరగనున్న అంతిమయాత్రకు రికార్డు స్థాయిలో రెండుకోట్ల మంది వస్తారని ఐఆర్‌జీసీ అంచనావేస్తోంది. ఈ అప్రకటిత యాత్రకే భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన మద్దతుదారులు నలుపురంగు దుస్తుల్లో వచ్చి నివాళులు అర్పించారు.
ఆ సందర్భంగా పలువురు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఇక తొమ్మిదో తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో ఈ యాత్ర జరగనుంది. ఆ రోజున ఖమేనీ స్వస్థలం మషాద్‌లో ఖననం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, బ్యానర్లు వెలిశాయి.
ఈ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇరాన్ నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం వచ్చింది. మనదేశం తరపున కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిట్ హాజరుకానున్నారు.
In an unannounced event, the coffin carrying the body of the martyred leader Ayatollah Khamenei was brought to the site of his martyrdom.#Revenge pic.twitter.com/ejWhaZ2Y1m
— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) July 2, 2026
