గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2015 (13:35 IST)

వైమానిక దాడులతో బెదిరేదిలేన్న : ఐఎస్ఐఎస్

తమను నిర్వీర్యం చేసేందుకు తమపై జరుపుతున్న వైమానిక దాడులకు బెదిరే ప్రసక్తే లేదని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా స్పష్టం చేసింది. ఇదే అంశంపై ఇస్లామిక్ స్టేట్ నేత అబూబకర్ అల్ బాగ్దాదీ పశ్చిమ దేశాలు చేస్తున్న విమాన దాడులతో ఐఎస్ఐఎస్ ఎంత మాత్రమూ బెదరబోదన్నారు. 
 
గత మేలో వీడియో మెసేజ్‌ని విడుదల చేసిన ఆయన ఆపై మరో వీడియోలో కనిపించడం ఇదే తొలిసారి. మొత్తం 24 నిమిషాల నిడివి వున్న వీడియోలో సిరియాలోని ఐఎస్ఐఎస్ స్థావరాలపై అమెరికా, రష్యా, ఫ్రాన్స్ చేస్తున్న దాడులను ప్రస్తావించాడు. 
 
కాలిఫేట్‌లో పాలన సజావుగా సాగుతోందని, ఇస్లాంపై విశ్వాసమున్న ప్రజలు ఇక్కడ సంతోషంగా ఉన్నారని కూడా చెప్పాడు. కాగా, యూఎస్ నేతృత్వంలోని సిరియా కుర్దిష్ లు, అరబ్, క్రిస్టియన్ గ్రూప్ వర్గాలు ఉత్తర సిరియాలో ఉగ్రవాదుల అధీనంలో ఉన్న యూఫరేట్స్ నదిపై ఉన్న కీలక డ్యామ్‌ను స్వాధీనం చేసుకున్నాయి.