శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 జనవరి 2016 (09:31 IST)

శతాబ్దాలుగా భారత్‌ అత్యంత సురక్షితమైన కేంద్రం : సుష్మా స్వరాజ్

ఒక్క యూదులకు మాత్రమే కాకుండా, ప్రపంచంలోని అన్ని జాతులు, మతాల వారికి భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న ఆమె జెరూసలెంలో స్థానిక ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. 'శతాబ్దాలుగా భారత్‌ యూదులకు సురక్షిత కేంద్రంగా ఉంది' అని అన్నారు. 
 
భారత్‌ నుంచి వచ్చి ఇజ్రాయెల్‌లో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రవాస భారతీయుల సేవా నిరతిని కొనియాడారు. ఇజ్రాయెల్‌లో సుమారు 80,000 పైగా భారత సంతతి యూదులు ఇజ్రాయెల్‌ పాస్‌పోర్టులతో ఉంటున్నారు. వీళ్లల్లో 10,000 మంది భారత పౌరులు కాగా.. మరో 8000 మంది సంరక్షకులుగా ఉంటున్నారు. మిగతా వారు వజ్రాల వ్యాపారులుగా.. ఐటీ ఉద్యోగులుగా, విద్యార్థులుగా, అసంఘటిత రంగ కార్మికులుగా ఉంటున్నారు.