కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరెత్తట్లేదు.. కిషన్ రెడ్డి ప్రశ్న
Smit Machchhar
కాక్‌పిట్‌లో తన సహ-పైలట్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని, 170 మందికి పైగా ప్రాణాలను కాపాడిన కెప్టెన్ మచ్చర్ ధైర్యసాహసాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కొనియాడి ఒక రోజైనా గడిచిపోయిందని కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ పైలట్‌కు కనీసం అభినందనలు తెలపడం పక్కన పెడితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వంటి కాంగ్రస్ అగ్రనేతలు కనీసం ఆ ఘటనను ప్రస్తావించలేదని ఆయన ఎత్తిచూపారు.
అన్ని విషయాల గురించి మాట్లాడే, సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టే రాహుల్ గాంధీ, కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించి కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేకపోయారని అని కిషన్ రెడ్డి అన్నారు. సోనియా కుటుంబానికి ఉన్న సమస్య ఏమిటని, భారత్, భారతీయులకు సంబంధించిన మంచి విషయాలను వారు ఎందుకు గుర్తించరని ఆయన ప్రశ్నించారు. "ఒక భారతీయుడు తన ధైర్యసాహసాలకు పొగడ్తలు పొందడాన్ని వారు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు?" అని ఆయన ప్రశ్నించారు.
దుబాయ్-టెల్ అవీవ్ విమాన ప్రయాణంలో జరిగిన ఒక ఘటన సమయంలో కెప్టెన్ మచ్చర్ ప్రదర్శించిన ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇతర ప్రపంచ నాయకులు ఇప్పటికే ప్రశంసించారని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఆ పైలట్ "తన ప్రాణాలకు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా పోరాడి, మరో 9/11 తరహా దాడి జరగకుండా అడ్డుకున్నారని" ప్రధాని మోదీ పేర్కొన్నారు.

