గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2015 (14:19 IST)

ఇంట్లో లేనప్పుడు పాటలు వింటూ, డ్యాన్స్ చేసిందట: అంతే భార్యకు భర్త తలాక్!!

ఆమె చేసిన పాపం ఏమిటంటే.. ఆమెకు ఇష్టం వచ్చిన పాటలు వినడం.. ఆ పాటలకు డ్యాన్స్ చేయడం.. అంతే ఆమె భర్త ఏకంగా విడాకులు ఇచ్చేశాడు. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. నిజమే.. ఇస్లామిక్ పద్ధతులను తుంగలో తొక్కిందంటూ భార్యకు ఓ భర్త విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. 
 
ఇస్లామిక్ భక్తి ఛానళ్లు తప్ప ఇతర కార్యక్రమాల్ని టీవీల్లో చూడొద్దని ఎన్నిసార్లు చెప్పినా.. తన భార్య పట్టించుకోలేదని అందుకే విడాకులు ఇచ్చేసినట్లు సౌదీలోని ప్రసార మాధ్యమాలు, మీడియా ప్రసారం చేశాయి. అయితే వీరి వివరాల్ని మాత్రం దుబాయ్ మీడియా బయటపెట్టలేదు.
 
తాను ఇంట్లో లేనప్పుడు పాటలు వింటూ... డ్యాన్సులు చేస్తోందనే కారణంతో భార్యకు ''తలాక్" చెప్పేశాడని దుబాయ్ మీడియా పేర్కొంది. ఎన్నిసార్లు వారించినా ఆమె చెప్పిన మాట వినలేదని అందుకే విడాకులు తీసుకున్నట్లు తెలిపింది. 
 
ఇకపోతే... పెళ్లి పేరిట తన భర్త తనను మోసం చేశాడని, ఎప్పుడూ స్థానిన వార్తలు, ఆధ్యాత్మిక విశేషాలే చూడమనే వాడని, తనకు సంగీతం అంటే ప్రాణమని అందుకే పాటల్ని వింటూ డ్యాన్స్ చేసేదాన్నని.. ఈ కారణంతో తనకు విడాకులిచ్చాడని ఆ మహిళ వాపోయినట్లు సౌదీ న్యూస్ ఛానల్స్ పేర్కొన్నాయి.