మొజ్తాబా ఖమేనీ 90 శాతం చచ్చిపోయే వుంటాడు, నన్ను చంపితే ఇరాన్‌ను మసి చేయండి: ట్రంప్
మళ్లీ అమెరికా-ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఒకవైపు అమెరికా సేనలు ఇరాన్ దేశం లోని కీలక స్థావరాలపై బాంబు దాడులు చేస్తున్నాయి. ఇంకోవైపు గల్ఫ్ దేశాలను హడలెత్తిస్తోంది ఇరాన్. గల్ఫ్ దేశాలలో వున్న అమెరికా స్థావరాలపై మెరుపు దాడులు చేస్తోంది. ఇదిలావుంటే రంగంలోకి రష్యా అధునాతన యుద్ధ విమానం ఒకటి ఇరాన్ దేశానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ కు ఇచ్చిన సమాచారంతో మరోసారి ఇరాన్ దేశంపైన విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ పైన 60 రోజుల యుద్ధం ప్రారంభించామనీ, అది ఈ నెల 7వ తేదీనే మొదలైనట్లు ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు. అమెరికా దేశ భద్రతకు ముప్పు వాటిల్లింపజేసే ఏ శక్తిని అమెరికా చూస్తూ మిన్నకుండిపోదని ఆయన హెచ్చరించారు.
ఆయన మాట్లాడుతూ... తనకున్న సమచారం ప్రకారం ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ 90 శాతం చనిపోయి వుంటాడని అనుకుంటున్నాను. అతడు గత 3 నెలలుగా ఎక్కడా కనిపించలేదు. మా సైన్యం చేసిన మెరుపుదాడుల్లో అతడు హతమై వుంటాడని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చారు. ఇరాన్ హిట్ లిస్టులో ట్రంప్ వున్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ సమాచారం అందుకున్న ట్రంప్... ఒకవేళ ఇరాన్ తనను హతమారిస్తే... ఇరాన్ దేశాన్ని మసి చేయాలని అమెరికన్ సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తమ్మీద ఇరాన్-అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి.
