1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (10:05 IST)

బురఖా ధరించిందనీ... ఉద్యోగం నుంచి ఊడపీకారు.. ఎక్కడ?

ఒక ఉద్యోగిని ఉన్నట్టుండి ఉద్యోగం నుండి తీసేయడానికి చాలా కారణాలుంటాయి. కానీ బురఖా ధరించిందనే కారణంతో ఓ మహిళను ఉద్యోగం నుంచి ఊడపీకిన ఘటన వర్జీనియాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... వర్జీనియాకు

ఒక ఉద్యోగిని ఉన్నట్టుండి ఉద్యోగం నుండి తీసేయడానికి చాలా కారణాలుంటాయి. కానీ బురఖా ధరించిందనే కారణంతో ఓ మహిళను ఉద్యోగం నుంచి ఊడపీకిన ఘటన వర్జీనియాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... వర్జీనియాకు చెందిన నజఫ్‌ఖాన్‌ ఫెయిర్‌ ఓక్స్‌ డెంటల్‌ కేర్‌లో అసిస్టెంట్‌టుగా విధులను నిర్వహిస్తుంది. ఉద్యోగానికి మొదటి రెండు రోజులు సాధారణ రీతిలోనే దుస్తులు వేసుకుని వెళ్లింది. 
 
కానీ మూడో రోజు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు సంప్రదాయ బురఖాను వేసుకుని వెళ్లింది. ఆ డెంటల్‌ కేర్‌ యజమాని చుక్‌జో కి బురఖాని చూసి ఒళ్లు మండింది. ఉద్యోగంలో మతవివక్షలు లేకుండా ఉండాలి. మతాన్ని ప్రతిబింభించే ఏ పని చేయడానికి కుదరదని ఖరాఖండిగా చెప్పాడు. 
 
దీంతో కోపం కట్టలు తెంచుకున్న నజఫ్‌ ఉద్యోగం మానేసింది. దీనిపై కౌన్సిల్‌ ఆఫ్‌ అమెరికన్‌ ఇస్లామిక్‌ రిలేషన్స్‌ స్పందిస్తూ... మతాచారాల వల్ల ఉద్యోగులు బాధపడకూడదని మళ్లీ తనను ఉద్యోగం చేర్చుకునేలా ఏర్పాటుచేసింది. కానీ అందుకు నజఫ్‌ తిరస్కరించింది.