సంబంధిత వార్తలు
- ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ
- ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్
- PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)
- ప్రధాని మోడీ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. కర్నూలులోనే మకాం వేసిన ఏపీ కేబినెట్
- బిచ్చగాళ్లపై మిజోరం సర్కారు ఉక్కుపాదం
భారత డీఎన్‌ఏలోనే ఇన్నోవేషన్ ఉంది: ప్రధాని మోదీ
ఇన్నోవేషన్స్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ డీఎన్ఏలోనే ఆవిష్కరణలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన నీస్ నగరంలో జరిగిన భారత్ ఇన్నోవేట్స్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. సుస్థిర భవిష్యత్, ప్రపంచం మేలు కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తుందన్నారు. తమ దేశానికి చెందిన యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చేలా పరిష్కార మార్గాలు చూపుతున్నారని అన్నారు.
'కృత్రిమ మేధ రంగంలో భారత్‌కు అపారమైన సామర్థ్యం ఉంది. మేం చేపట్టిన 'సంస్కరణల ఎక్స్‌ప్రెస్' ఆగదు. అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. మా దేశంలో 2 లక్షలకు పైగా స్టార్టప్‌లున్నాయి. ఇవి దేశంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ బలాన్నిస్తున్నాయి. మా దేశం ఆవిష్కరణలను వినియోగించుకునే దేశం మాత్రమే కాదు. ఆ రంగానికి సహకారం అందించేదిగానూ ఆవిర్భవించింది' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మాట్లాడుతూ.. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రశంసించారు. తమ దేశం కూడా వివిధ రంగాల్లో ఇందులో భాగస్వామిగా ఉందన్నారు. భారత్‌ను 'ఆవిష్కరణల దేశం'గా పేర్కొన్నారు. ఏఐ, వాతావరణ మార్పుల వంటి కీలక రంగాల్లో ఇరుదేశాల మధ్య దృఢమైన భాగస్వామ్యం ఉందని చెప్పారు. పౌర అణుశక్తి రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించుకోవడానికి ఆస్కారం ఉందన్నారు.
