బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2015 (12:19 IST)

భూమిని ఢీ కొట్టనున్న గ్రహశకలం: గల్ఫ్, అట్లాంటిక్ తీరాలు మటాష్!?

గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందట. అదీ వచ్చేనెలలో గ్రహశకలం భూమిని ఢీకొట్టడం ద్వారా అట్లాంటిక్, గల్ఫ్ తీరాలు నాశమయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. దీనిపై బ్లాగర్లు, సోషల్ మీడియా ఔత్సాహికులు పుంఖాను పుంఖాలుగా కథనాలు రాసేస్తున్నారు. ఈ గ్రహశకలంతో అట్లాంటిక్, గల్ఫ్ తీరాల వద్ద ఇది భూమిని ఢీ కొట్టనుంది. అది ఢీ కొట్టిన ప్రాంతం మటాష్ అవుతుందని పుకార్లు వస్తున్నాయి.
 
అయితే నాసా మాత్రం అవన్నీ పుకార్లేనని, నిరాధారమై వార్తలని స్పష్టం చేసింది. అంతేగాకుండా ఇంటర్నెట్‌లో వచ్చే వార్తలను ఏమాత్రం పట్టించుకోకుండా నిశ్చింతగా ఉండాలని నాసా పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 15 నుంచి 28వ తేదీ లోపు ఈ భూమిని గ్రహశకలం ఢీకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భూమి నశిస్తుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని నాసా స్పష్టం చేసింది. సెప్టెంబరుతోనే ప్రపంచం అంతమైపోదని నాసా తేల్చి చెప్పింది.