1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Need India's Help : PoK Leaders Cry For Aid Amid Pakistan's Brutalities

పాకిస్థాన్‌కు అల్టిమేటం జారీ చేసిన పీవోకే నేతలు

pakistan flag
పాకిస్థాన్‌క్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నేతలు అల్టిమేటం జారీచేశారు. పాకిస్థాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌‌లో నిరసనలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. జులై 9న ఫైనల్ యాక్షన్‌ను ప్రారంభిస్తామని జమ్మూకాశ్మీర్‌ జాయింట్ అవామీ యాక్షన్‌ కమిటీ పాక్‌ సర్కారుకు అల్టిమేటం ఇచ్చింది. 
 
తమ నిరసనల్లో భాగం కావాలని పీఓకే ప్రజలు, ప్రవాస కశ్మీరీలకు పిలుపునిచ్చింది. ఆ రోజున పీఓకేలో పర్యటించాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌, ఐరాస ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా, మానవహక్కుల సంఘాలను ఆహ్వానించింది. ఆ డెడ్‌లైన్ గడువు వరకు క్షమశిక్షణతో వ్యవహరించాలని తన మద్దతుదారులను కోరింది.
 
పాక్‌ ప్రభుత్వ అణచివేతలు, పౌరుల హత్యలను అంతర్జాతీయ సమాజం గమనించాలని జేఏఏసీ అభ్యర్థించింది. నిరసల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించింది. సమాచార వ్యవస్థను పునరుద్ధరించాలని, ఆహారం, మందుల సరఫరాను అడ్డుకోవద్దని, నిర్బంధంలో ఉన్న తమ నాయకులను విడిచిపెట్టాలని, 38 పాయింట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని జేఏఏసీ డిమాండ్‌ చేస్తోంది. ప్రజల డిమాండ్లకు తూటాలతో స్పందిస్తే.. తమకు ఇతర మార్గాలు ఉన్నాయని పాక్ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించింది.
 
మరోవైపు, జేఏఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడినట్లు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘‘మాకు భారత్ సహాయం కావాలి. ఆహారపదార్థాలు, నిత్యావసరాల కొరత ఉంది. మానవతా సాయం అందించండి’’ అని ఆయన కోరినట్టుగా ఆ వీడియోలో ఉండటం గమనార్హం. నిరసనలను కఠినంగా అణచివేస్తోన్న పాక్‌.. ఆర్థిక దిగ్బంధనాన్ని విధించిదని అందులో ఆరోపించారు. పరిస్థితులు మరింత దిగజారితే పౌరులు భారత్‌కు వచ్చేందుకు వీలుగా నియంత్రణ రేఖ వెంట సరిహద్దును తెరవాలని అమన్‌ ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఫారిన్‌అడ్మిట్స్‌తో భాగస్వామ్యం ద్వారా విద్యార్థి చలనశీలత కోసం క్రిజాక్