మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2015 (14:20 IST)

ఆ దేశాల్లో నగ్నంగా జాగింగ్ చేయడం చట్టబద్ధం.. ఏఏ దేశాల్లో?

సాధాణంగా నగ్నంగా వీధి లేదా రోడ్డుపై కనిపిస్తే.. వాడిని పిచ్చోడిగా పరిగణిస్తాం. ఆ తర్వాత పోలీసులకు సమాచారం చేరవేసి... పిచ్చాసుపత్రిలో చేర్పిస్తాం. కానీ, ఆ  రెండు దేశాల్లో మాత్రం ఏకంగా నగ్నంగా జాగింగ్ చేయవచ్చు. ఆ మేరకు ఆ రెండు దేశాల్లో న్యూడ్ జాగింగ్‌ను చట్టబద్ధం చేశాయి. దీనికి ఆ దేశ కోర్టులు కూడా అనుమతినివ్వడం గమనార్హం. 
 
నగ్న జాగింగ్‌ను లీగలైజ్ చేసిన దేశాల్లో న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్‌‌లు ముందు వరుసలో ఉన్నాయి. బట్టలను ఇంటి దగ్గరే వదిలి నగ్నంగా రోడ్‌ మీదకొచ్చి జాగింగ్‌ లేదా వ్యాయామం చేయడాన్ని అక్కడి కోర్టులు అనుమతించాయి. ‘న్యూడ్‌ జాగింగ్‌ నేరమైతే దేవుడు మనకు జననాంగాలను ఇచ్చుండకూడదు’ అని ఓ న్యాయవాది కూడా పేర్కొనడం గమనార్హం. అక్కడ ఉదయం సమయాల్లో చాలామంది నగ్నంగానే జాగింగ్‌ చేస్తున్నారు. కాగా, నగ్నంగా సూర్యోదయ సమయాల్లో పరిగెట్టడం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని కొంతమంది నేచరిస్టులు వాదిస్తున్నారు.