గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 23 జూన్ 2016 (13:08 IST)

మగరాయుడిలా నడుస్తున్న ఎలుగబంటి.. దాని ముద్దుపేరు పెడల్స్... ఎందుకో తెలుసా?

చింపాంజీలు మనుషుల్లా ఉంటాయని... అలాగే నడుచుకుంటుందని అందరికి తెలిసిందే. కాని ఎలుగుబంటి మనిషిలా నడుస్తుంటే నమ్ముతారా... నిజంగా ఇది ఆశ్చర్యమే. అమెరికా న్యూజెర్సీ రాష్ట్రంలోని ఓక్‌రిడ్జ్ నగరంలో ఓ ఎలుగుబం

చింపాంజీలు మనుషుల్లా ఉంటాయని... అలాగే నడుచుకుంటుందని అందరికి తెలిసిందే. కాని ఎలుగుబంటి మనిషిలా నడుస్తుంటే నమ్ముతారా... నిజంగా ఇది ఆశ్చర్యమే. అమెరికా న్యూజెర్సీ రాష్ట్రంలోని ఓక్‌రిడ్జ్ నగరంలో ఓ ఎలుగుబంటి అచ్చం మనిషిలాగే నడుస్తోంది. వెనుకనున్న రెండు కాళ్ల సహాయంతో అచ్చం మగరాయుడిలా నడిచి అందరిని అబ్బురపరుస్తోంది. ఇలాఎందుకు నడుస్తోందంటే దాని ముందు చేతులకు దెబ్బ త‌గ‌ల‌డంతో అది చేతులను సరిగా వాడ‌డం లేదు. 
 
కేవ‌లం వెనుక కాళ్ల మీదే ఆధారపడి న‌డుస్తోంది. ఏదైనా అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ముందు చేతులని ఉపయోగించడం లేదు. ముందు చేతులకి తీవ్రంగా దెబ్బతగలడంతో వెనక కాళ్ల సహాయంతోనే నడవడం మొదలుపెట్టిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఓక్‌రిడ్జ్ నగరంలో సంచరిస్తున్నఈ ఎలుగుబంటికి పెడల్స్ అనే ముద్దు పేరుంది. 
 
ఆ ఎలుగుబంటి అలా నడుస్తున్న వీడియో ఫేస్‌బుక్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తొలుత ఎలుగుబంటి సంరక్షణ కోసం దీన్ని జంతు సంర‌క్ష‌ణ కేంద్రానికి త‌ర‌లించాల‌ని డిమాండ్లు వ‌చ్చాయి. కానీ న్యూ జెర్సీ అధికారులు మాత్రం పెడ‌ల్స్‌ను అడ‌విలోనే వ‌దిలేశారు.