శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 10 అక్టోబరు 2014 (14:52 IST)

అమెరికా యూత్ ట్రెండ్... : నగ్న సెల్ఫీ... షేర్‌లతో ముచ్చట్లు

అగ్రరాజ్యం అమెరికా యువకుల్లో సరికొత్త ట్రెండ్ ఆరంభమైంది. అది నగ్న సెల్ఫీలు ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోవడం. తమకు వచ్చిన నగ్న సెల్ఫీలను తమ స్నేహితులకు పంపించుకుంటూ వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కొత్త ఫ్యాషన్ అమెరికా యువతరంలో పెరిగిపోతోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. 
 
ఇటీవలి కాలంలో నగ్నసెల్ఫీలు షేర్ చేసుకుని యువతీయువకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆ అధ్యయనంలో తేలింది. సంస్కృతి వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఉటా తన పరిశోధనలో వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లతో ఇలాంటి అశ్లీల సెల్పీలు తీసుకుని ఒకరికొకరు పంపుకోవడాన్ని ‘సెక్సింగ్' అనే పేరును యూత్ పెట్టుకుని సంబరపడి పోతోంది.