ఈ ట్రంప్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు, కొత్త మ్యాప్ పెట్టాడు...
అమెరికా అధ్యక్షుడు 2.0 పవర్ ఏమిటో ప్రపంచానికి చూపిస్తున్నట్లున్నారు. రెండోసారి అమెరికా పీఠాన్ని అధిష్టించిన దగ్గర్నుంచి నిత్యం ఏదో ఒకదానితో వార్తల్లో వ్యక్తిగా వుంటున్నాడు. ఒకవైపు టారిఫ్ లు బాదుడు చేస్తూనే ఇంకోవైపు కొన్ని దేశాలను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కలిపేసుకోవాలని కలలు కంటున్నారు. తాజాగా ట్రూత్ సోషల్ మీడియాలో పేజీలో ఆయన పెట్టిన ఓ మ్యాప్ చూసి ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి.
ఇంతకీ అందులో ఆయన ఏం చేసాడంటే... అమెరికా పతాకాన్ని కెనడా, వెనిజులా, గ్రీన్ ల్యాండ్ భూభాగాలపైన కూడా పరిచేసినట్లు పెట్టేసారు. పైగా దాని కింద గ్రీన్ ల్యాండ్ యూఎస్ భూభాగం - స్థాపన 2026 అంటూ ట్యాగ్ లైన్ జోడించారు. గ్రీన్ ల్యాండ్ భద్రత దృష్ట్యా అమెరికా ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకుని తీరాలని ట్రంప్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు.
కాగా ఇప్పటికే వెనిజులాను తామే పాలిస్తున్నట్లు చెప్పేసారు. గ్రీన్ ల్యాండ్ కూడా త్వరలో తమదేనంటూ చెబుతున్నారు. ఇక ఆ తర్వాత కెనడానే అంటున్నారు. దీనితో నాటోలోని దేశాలు ట్రంప్ చేష్టలపై పళ్లు కొరుకుతున్నాయి.