సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 మార్చి 2026 (13:29 IST)

చాలా మందిలో ఆర్థం చేసుకునే నైపుణ్యం - వినగలిగే సామర్థ్యం తగ్గిపోయింది : నోరా ఫతేహి

nora fatehi
ఇపుడు చాలా మందిలో విషయాన్ని అర్థం చేసుకునే నైపుణ్యం, వినగలిగే సామర్థ్యం తగ్గిపోయినట్టుందని బాలీవుడ్ నటి, డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేరా అన్నారు. ప్రపంచ శాంతి, ఐక్యతను కోరుతూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనివున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ నోరా ఫతేరా ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియోపై కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ చేశారు. దీనికి స్పందనగా నోరా ఫతేరా మరో వీడియోను రిలీజ్ చేశారు. 
 
చాలా మందికి విషయాన్ని అర్థం చేసుకునే నైపుణ్యం, వినగలిగే సామర్థ్యం తగ్గిపోయినట్టుంది. శాంతియుతంగా జీవించాలని నేను ప్రపంచంలోని ప్రజలందరి గురించి మాట్లాడాను. గందరగోళానికి వ్యతిరేకంగా మాట్లాడాను. నా మాటలతో మీకు సమస్య ఉంటే నైతికంగా మీలోనే ఏదో లోపం ఉన్నట్టు. మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
నా మాటలు ఎవరినైనా బాధిస్తే లేదా చికాకు కలిగిస్తే సమస్య నాలో కాదు. ఆ సందేశాన్ని స్వీకరించలేని మీలోనే వుంది. ప్రపంచ శాంతి గురించి మాట్లాడితే కోపం తెచ్చుకునే ప్రపంచంలో మనం జీవిస్తున్నామంటే అది చాలా భయాకనమైన విషయం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.