సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2026 (17:02 IST)

ఎయిర్‌స్ట్రైక్‌లో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ హతం?

ayatollah arafi
తమ మాట వినని ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా వైమానిక దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ కూడా హతమైనట్టు వార్తలు వస్తున్నయి. అయితే, ఈ వార్తలను ఇరాన్ ప్రభుత్వం ధృవీకరించలేదు. 
 
కాగా, రెండు రోజుల క్రితం అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీని నుంచి ఇరాన్ అధికార యంత్రాంగం తేరుకోకముందే తాజాగా ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ కూడా అరాఫీ కూడా హతమైనట్టు వార్తలు రావడం గమనార్హం. ఈయన బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే అమెరికా జరిగిన ఎయిర్‌స్ట్రైక్‌లో చనిపోయినట్టు తెలుస్తోంది. 
 
అయితే, ఈ మృతిని ఇరాన్ అధికార వర్గాలు ధృవీకరించాల్సివుంది. ఖమేనీ హత్యను మొదట ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్ అధికారులు ధృవీకరించారు. ఇదిలావుంటే, ఇజ్రాయెల్ ప్రధాన నెతన్యాహు లక్ష్యంగా ఇరాన్ దాడులను ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయంపై దాడి చేస్తోంది. 
 
ఇదిలావుంటే, హిజ్బుల్లా చీఫ్ షేక్ నయీం ఖాసీంను ఇజ్రాయెల్ రక్షణ దళం లక్ష్యం చేసుకని వైమానిక దాడులు నిర్వహిస్తోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులను మరింత ముమ్మరం చేసింది. ఇరాన్‌కు మద్దతుగా హిజ్బుల్ కూడా దాడులు చేపట్టింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా స్థావరాలపైకి దాడులను విస్తరించింది.