గంటకు 100 కి.మీ వేగంతో కారుతో ఢీకొట్టి ప్రియుడిని చంపిన ప్రియురాలు, 15 ఏళ్లు జైలు శిక్ష
ఆ ప్రియుడు ఏం చేసాడో తెలియదు కానీ అతనితో పాటు అతడి స్నేహితుడిని గంటకు 100 కి.మీ వేగంతో కారులో వచ్చి ఢీకొట్టి చంపేసింది ఆ ప్రియురాలు. ఆ ధాటికి వారిద్దరు శరీరాలు కారు ముందుభాగంలో ఇరుక్కుపోయాయి. అతి కష్టమ్మీద పోలీసులు మృతదేహాలను వెలికి తీసారు. ఈ ఘటన జరిగింది 2023లో. ఈ ఘటన అమెరికాలోని ఓహియోలో జరిగింది.
ప్రియుడిని, అతడి స్నేహితుడిని ఉద్దేశ్యపూర్వకంగానే కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది. దీనితో ఆమెకు కోర్టు 15 ఏళ్ల కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. ఇంతకీ ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలే. జడ్జి శిక్షను ఖరారు చేస్తున్న సమయంలో ఆ యువతి కన్నీటిపర్యంతమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికా కోర్టులో 19ఏళ్ల యువతికి 15ఏళ్ల జైలు శిక్ష..!
— UttarandhraNow (@UttarandhraNow) May 22, 2026
తెగ వైరల్ అవుతున్న వీడియో...
కేసు వివరాల్లోకి వెళ్తే..
19 ఏళ్ల షిరిల్లా అనే యువతికి, ఇద్దరిని చంపిన కేసులో 15ఏళ్లు జైలు శిక్ష వేసిన జడ్జి.
తన కారును ఉద్దేశపూర్వకంగా గంటకు 120కిలోమీటర్ల వేగంతో నడిపి తన 20 ఏళ్ల ప్రియుడిని… pic.twitter.com/pzXyVa260z
