మంగళవారం, 9 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 డిశెంబరు 2025 (17:44 IST)

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్లను వద్దనే వద్దంటున్న కంపెనీ

sathya Nadella
మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగుతేజం సత్య నాదెళ్ల కొనసాగుతున్నారు. ఆయన మరోమారు ఈ పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, నార్వేకు చెందిన ఓ సంస్థ మాత్రం ఆయనను మాత్రం వద్దనే వద్దు అంటోంది. పైగా, ఆయన వేతన ప్యాకేజీపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నార్వేకు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ సంస్థ మైక్రోసాఫ్ట్ వార్షిక షేర్ హోల్డర్ల మీటింగ్‌లో సత్య నాదెళ్లకు వ్యతిరేకంగా ఓటు వేసింది. 
 
ఈ నెల 5వ తేదీన ఈ వార్షిక షేర్ హోల్డర్ల సమావేశం జరిగింది. ఇందులో పలు అంశాలపై బోర్డు మీటింగ్ జరిగింది. మెక్రోసాఫ్ట్‌లో ఎనిమిదో అతిపెద్ద షేర్ హోల్డర్ అయిన నార్వే సావరిన్ ఫండ్ బోర్డు ప్రతిపాదనలను వ్యతిరేకించింది. ఒకేసారి సీఈవో, బోర్డు చైర్మన్‌గా ఉండటం బోర్డు స్వతంత్రతను బలహీనపరుస్తుంది. ఆయన బాధ్యతను తగ్గిస్తుంది అని ఆ సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. 
 
ఈ ఫండ్‌కు మైక్రోసాఫ్ట్‌లో 1.35 శాతం వాటా వుంది. దీని విలువ దాదాపు 50 బిలియన్ డాలర్లు. చిప్‌ల తయారీ కంపెనీ ఎన్విడియాలో కూడా ఈ ఫండ్‌కి కూడా వాటాలు ఉన్నాయి. ఇతర మేజర్ షేర్ హోల్డర్లు నాదెండ్లకు అనుకూలంగా ఓటు వేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను 96.5 మిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఇవ్వడానికి కూడా అంగీకరించారు. అంతకుముందు యేడాది కంటే ఇది 22 శాతం ఎక్కువ. ఈ పెరుగదల ప్రధానంగా స్టాక్ అవార్డుల వల్ల వచ్చింది. కాగా, ఈ యేడాది మైక్రోసాఫ్ట్‌ షేర్లు 23 శాతం పెరిగాయి. అలాగే, గత మూడేళ్లలో రెట్టింపు అయ్యాయి.