1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Pakistan PMO-s move to crop Prime Minister Narendra Modi out of an SCO group photograph

పాకిస్తాన్ తిక్క చేష్టలు, ప్రధాని మోడి ఫోటోను కత్తిరించి శునకానందం

PM Narendra Modi and other world leaders
పాకిస్తాన్ తిక్క చేష్టలకు, పిచ్చి పనులకు అంతే వుండదు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ భారతదేశాన్ని రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంటుంది. తాజాగా మరో తిక్క పని చేసింది. ఇటీవలే కిర్గిజ్‌స్థాన్ లోని బిష్కెక్‌లో ఎస్‌‍సిఓ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రపంచ నాయకులందరూ కలిసి ఓ గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫోటోలో ఎడమ పక్క చివరన పాకిస్తాన్ ప్రధాని వుండగా కుడివైపు చివర భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి వున్నారు.
 
ఐతే పాకిస్తాన్ పీఎంఓ పోస్ట్ చేసిన ఫోటోలో భారత్, ఇరాన్ దేశ ప్రధానుల ఫోటోలను క్రాప్ చేసి చూపారు. పైగా ఆ ఫోటో కింద ప్రపంచ నాయకులతో పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటూ క్యాప్షన్ పెట్టారు. పాకిస్తాన్ చేసిన ఈ పనిపై భారతదేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. ఈలోగా పాకిస్తాన్ ప్రధాని పూర్తి గ్రూప్ ఫోటోను షేర్ చేస్తూ... ఎస్సిఓ దేశాధినేతల మండలి సమావేశంలో ప్రసంగించే గౌరవం నాకు దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ శిఖరాగ్ర సమావేశం విజయవంతంగా నిర్వహించిన కిర్గిజ్ రిపబ్లిక్ దేశాన్ని నేను అభినందిస్తున్నానంటూ పేర్కొన్నారు.
 
కాగా పాకిస్తాన్ ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తూనే వుంటుందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మండిపడ్డారు. వారు ఫోటోలో మోడీజిని తొలగించి వుండవచ్చు కానీ మోడీజీ తలచుకుంటూ ప్రపంచ పటంలో పాకిస్తాన్ దేశాన్ని లేకుండా చేయగలరని అన్నారు.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Fake Currency Racket: నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్.. ఎక్కడంటే?