1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Partial, Lacks Credibility : Iranian Lawmaker's Big Allegation Against Mediator Pakistan

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ అనుమానం.. అమెరికా సరికొత్త ప్రతిపాదన

iran flags
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నివారించేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల మధ్యవర్తిగా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. ఇందులోభాగంగా, పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇటీవల సుధీర్ఘంగా జరిగిన ఈ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్య్యంలో ప్రాంతీయంగా జరుగుతున్న కీలక చర్చలపై పాక్ మధ్యవర్తిత్వాన్ని ఇరాన్ వ్యతిరేకిస్తుంది. దీనికి కారణం పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంపై అనుమానం వ్యక్తం చేయడమే. ఈ పరిణామం దౌత్య వర్గాల్లో కలకలం రేపుతోంది.
 
ఇరాన్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి, ఎంపీ అయిన ఇబ్రహీం రెజాయీ స్పందిస్తూ, 'పాకిస్థాన్ తమకు మంచి మిత్రదేశం, పొరుగు దేశమే అయినప్పటికీ, మధ్యవర్తిత్వానికి అది సరైన దేశం కాదు' అని ఆయన ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. "మధ్యవర్తి అనేవారు నిష్పక్షపాతంగా ఉండాలి, కానీ పాకిస్థాన్ ఎప్పుడూ ఒకవైపు మొగ్గు చూపుతోంది. అమెరికాను విమర్శించడానికి ఇస్లామాబాద్ వెనుకాడుతోంది" అని ఆయన పేర్కొన్నారు. 
 
లెబనాన్, స్తంభింపజేసిన ఆస్తుల వంటి విషయాల్లో అమెరికా తన హామీలను నెరవేర్చలేదని ఎత్తిచూపడంలో పాక్ విఫలమైందని రెయీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన సమయంలోనే ఇరాన్ దౌత్యవేత్త అబ్బాస్ అరాఘీ చర్చలను కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన గత మూడు రోజుల్లో రెండుసార్లు ఇస్లామాబాద్‌ను సందర్శించి, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో సమావేశంకావడం గమనార్హం. 
 
కాగా, ప్రస్తుత చర్చలు కేవలం అణు ఒప్పందానికే పరిమితం కాలేదని ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. హర్మూజ్ జలసంధికి కొత్త చట్టపరమైన ఫ్రేమ్ వర్క్, నష్టపరిహారం డిమాండ్లు, సైనిక చర్యలకు వ్యతిరేకంగా హా
మీలు, అమెరికా సముద్ర ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలు కూడా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్ పర్యటన తర్వాత అరాఘి మాస్కో వెళ్లనున్నారు. 
 
మరోవైపు, ఇరాన్‌తో దౌత్య ప్రయత్నాలు నెమ్మదించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చర్చలు కావాలనుకుంటే ఇరానే తమను నేరుగా సంప్రదించవచ్చని ఆయన అన్నారు. "వారికి మాతో మాట్లాడాలని ఉంటే, వారే మా వద్దకు రావచ్చు లేదా మాకు ఫోన్ చేయవచ్చు. మా వద్ద సురక్షితమైన టెలిఫోన్ లైన్లు ఉన్నాయి" అని ఓ
 
ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్లో జరగాల్సిన చర్చల రౌండు వాషింగ్టన్ రద్దు చేసుకున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు. చేయడం గమనార్హం.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఏపీలో మొదటిసారి పెట్రోల్, డీజిల్ కొరత, ఎక్కడ తప్పు జరిగింది? ప్రతి 3 గంటలకు ఒకసారి...